Fever Survey: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన ఫీవర్‌ సర్వే

తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే ప్రారంభమైంది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటా

Published : 21 Jan 2022 13:12 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే ప్రారంభమైంది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే చేపడుతున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారి వివరాలతో పాటు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర లక్షణాలపై ఆరా తీస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి అవసరమైతే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ హోం ఐసోలేషన్‌ కిట్‌ను అందజేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కోటి కిట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించారు. ఇంటి వద్దే చికిత్స పొందుతున్న వారిని వైద్యసిబ్బంది నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలో ఒకవేళ లక్షణాలు తీవ్రమైతే.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు. నాలుగైదు రోజుల్లో ఈ ఫీవర్‌ సర్వేను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని