First Aid: గాయాలతో అధిక రక్తస్రావం అయితే ఏం చేయాలి...?

ప్రమాదం జరిగితే ఒళ్లంతా గాయాలే అవుతాయి. తీవ్రంగా రక్తం కారిపోతుంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో సమీపంలో ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ప్రథమ చికిత్స ఎలా అందించాలో తెలుసుకోండి..!

Published : 05 Aug 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రమాదం జరిగితే ఒళ్లంతా గాయాలే అవుతాయి. తీవ్రంగా రక్తం కారిపోతుంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో సమీపంలో ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ప్రథమ చికిత్స ఎలా అందించాలో తెలుసుకోండి..!

* ప్రమాదాలు జరిగినపుడు తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. ఇలాంటప్పుడు సాధ్యమయినంత తొందరగా రక్తాన్ని ఆపేందుకు ప్రయత్నించాలి.

* గాయాలపాలైన వ్యక్తులను నేలపై పడుకోబెట్టాలి. తల కొంచెం ఎత్తులో ఉండేలా చూడాలి.

* గాయాలను శుభ్రం చేయడానికి ముందుగా చేతులకు గ్లౌజులను ధరించాలి. గాయాల్లో ఏవైనా వ్యర్థ పదార్థాలుంటే సులువుగా తొలగించాలి.

* గాయం లోతుగా ఉండి లోపల ఏదైనా ఇరుక్కొని ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేయొద్దు.

* ఆ తర్వాత స్టెరిలైజ్‌ బ్యాండేజ్‌ లేదా శుభ్రంగా ఉన్న బట్టతో గాయాలపై కట్టాలి. అయినా రక్తం ఆగకపోతే మళ్లీ మళ్లీ గాయాలపై ఇలాగే కట్టు కట్టాలి.

* ధమని తెగినపుడు రక్తస్రావం అధికంగా అవుతుంది. ఇలాంటి సమయంలో రక్త నాళాన్ని గట్టిగా పట్టుకోవాలి. 

* ప్రథమ చికిత్స అనంతరం గాయ పడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని