అనంతపురం పీఎస్‌ వద్ద ఉద్రిక్తత

అనంతపురం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం నుంచి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని నిరసిస్తూ.. పీఎస్‌ ఎదుట బైఠాయించేందుకు తెదేపా నేతలు...

Published : 04 Jan 2020 19:19 IST

అనంతపురం: అనంతపురం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం నుంచి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని నిరసిస్తూ.. పీఎస్‌ ఎదుట బైఠాయించేందుకు తెదేపా నేతలు పల్లె రఘురాథరెడ్డి, పార్థసారథి, ఈరన్న ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బెయిల్‌ ప్రక్రియ పూర్తిచేయానికి ఎంత సమయం పడుతుందో పోలీసులు చెప్పకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు ముందస్తు బెయిల్‌ తీసుకొని దివాకర్‌రెడ్డిని పోలీసులు స్టేషన్‌ నుంచి పంపించారు.

పోలీసుల తీరును ఖండించిన చంద్రబాబు

జేసీ దివాకర్‌ రెడ్డిని పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. నేతలు, కార్యకర్తలు జేసీని కలవకుండా ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పబట్టారు. బెయిల్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని పోలీసులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని