వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే: తితిదే

గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు...

Updated : 05 Jan 2020 17:52 IST

తిరుపతి: గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తితిదే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైకుంఠ ద్వారాలను 10 రోజులు తెరవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. మరోవైపు శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 ఈ విధానం అమల్లోకి వస్తుందని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకే ఉచిత లడ్డూ అందిస్తామన్నారు. రూ.50కి అదనపు లడ్డూ అందుబాటులో ఉంచుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని