ఆ రైల్వే స్టేషన్లలో సంస్కృతం

ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష....

Updated : 20 Jan 2020 00:57 IST

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌ రైల్వేస్టేషన్లలోని నామ ఫలకాలపై ఉర్దూ స్థానంలో ఇకపై సంస్కృతం వచ్చి చేరనుంది. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉండే నామ ఫలకాలు ఆ రాష్ట్రానికి చెందిన ద్వితీయ భాష ఉండొచ్చని రైల్వే నియమావళి చెబుతోంది. ఆ రాష్ట్రం ద్వితీయ భాష సంస్కృతం కావడంతో ఆంగ్లం, హిందీ తర్వాత ఉర్దూ స్థానంలో స్టేషన్‌ పేర్లు సంస్కృతంలో ఉండనున్నాయి. త్వరలో వీటిని మార్చనున్నట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉర్దూ ద్వితీయ భాష కావడంతో అదే రాష్ట్రం నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్‌లోని రైల్వేస్టేషన్ల పేర్లు చాలా వరకు ఉర్దూలోనే ఉన్నాయి. అయితే, ప్రస్తుత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, నాటి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ హయాంలో ఉత్తరాఖండ్‌ ద్వితీయ భాషగా సంస్కృతం గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ఈ మార్పు చోటుచేసుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని