గద్వాలలో కాంగ్రెస్-ఎంఐఎం మధ్య ఘర్షణ

 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. ఎంఐఎం నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని

Published : 22 Jan 2020 09:40 IST

గద్వాల కలెక్టరేట్:  జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. ఎంఐఎం నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత శంకర్ వారితో గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో శంకర్ కాలికి గాయాలయ్యాయి.  పోలీసులు వెంటనే అతన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లాఠిఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని