‘ఈనాడు’ఎండీకి లబ్ధిదారుల కృతజ్ఞతలు

కేరళలోని అలెప్పీ జిల్లా మరియకుళంలో నిర్మించిన ఇళ్లను ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌ ఆదివారం పరిశీలించారు.  ఇళ్లను పొందిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 09 Feb 2020 23:44 IST

అలెప్పీ: కేరళలోని అలెప్పీ జిల్లా మరియకుళంలో నిర్మించిన ఇళ్లను ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌ ఆదివారం పరిశీలించారు.  ఇళ్లను పొందిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయిన కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రామోజీ గ్రూపు సంస్థలు తలపెట్టిన మహా సంకల్పం తుది అంకానికి చేరింది. 2018 వర్షాకాలంలో కనీవినీ ఎరుగని కుంభవృష్టితో రోడ్డున పడిన బాధితుల జీవితాల్లో నేడు వెలుగులు ప్రసరించనున్నాయి. అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రామోజీ గ్రూప్‌ నిర్మించిన 121 రెండు పడక గదుల ఇళ్లను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  కాసేపట్లో లబ్ధిదారులకు అందించనున్నారు. అలెప్పీలోని హోటల్‌ కేమ్లాట్‌ వేదికగా నిర్వహించే కార్యక్రమానికి రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఈనాడు ఎం.డి. కిరణ్‌, మార్గదర్శి ఎం.డి. శైలజా కిరణ్‌ హాజరుకానున్నారు. కార్యక్రమానికి కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ ఐజక్‌ అధ్యక్షత వహించనున్నారు.

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

ఇదీ చదవండి..

కేరళలో ‘ఈనాడు’ ఇళ్ల పట్టాలు అందజేసిన సీఎం

సాయం మీది... సంతోషం వారిది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని