‘జీవోలు వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచడం లేదు’

ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. భారత సిలికాన్‌ వ్యాలీలాంటి హైదరాబాద్‌ మహానగరంలో...

Published : 18 Feb 2020 01:29 IST

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్‌: ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. భారత సిలికాన్‌ వ్యాలీలాంటి హైదరాబాద్‌ మహానగరంలో వెబ్‌సైట్‌లో జీవోలు అప్‌లోడ్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ లభించడం లేదా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులను పబ్లిక్‌ డొమైన్‌లో పొందుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ భాజపా నేత పేరాల శేఖర్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.

సుమారు 40 పేజీల జీవోలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయని.. ప్రజలకు అందుబాటులో ఉంచలేదని పేరాల శేఖర్‌రావు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఎందుకు పొందుపరచడం లేదో తెలుపుతూ ఈనెల 28లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని