ఏపీకి నాబార్డు రుణం మంజూరు

ఏపీకి రూ.1931 కోట్ల రుణం మంజూరు చేస్తూ నాబార్డు నిర్ణయం తీసుకుంది. ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు ఈ రుణాన్ని ఇవ్వనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ కింద ఈ రుణ మొత్తాన్ని మంజూరు...

Published : 19 Feb 2020 20:19 IST

అమరావతి: ఏపీకి రూ.1931 కోట్ల రుణం మంజూరు చేస్తూ నాబార్డు నిర్ణయం తీసుకుంది. ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు ఈ రుణాన్ని ఇవ్వనుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ కింద ఈ రుణ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు నాబార్డు ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని వినియోగించనుంది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధి 33 మండలాల్లోని 410 గ్రామాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. గోదావరి వరద జలాలను మూడు దశల్లో మళ్లించేందుకు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించనున్నారు.  53.5 టీఎంసీల నీటిని ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా పశ్చిమ గోదావరి, పశ్చిమ కృష్ణాలోని ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం 4.8 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2022 మార్చి నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని