పౌరుడి ట్వీట్‌.. పోలీస్‌ కారుకు చలానా

పోలీస్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. సైదాబాద్‌ టి జంక్షన్‌ వద్ద పోలీసులు రహదారికి అడ్డంగా వాహనం నిలిపారంటూ కమిషనర్‌కు ఓ పౌరుడు ట్వీట్‌ చేశాడు. పౌరుడి ఫిర్యాదును...

Updated : 23 Feb 2020 02:21 IST

హైదరాబాద్‌: పోలీస్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. సైదాబాద్‌ టి జంక్షన్‌ వద్ద పోలీసులు రహదారికి అడ్డంగా వాహనం నిలిపారంటూ కమిషనర్‌కు ఓ పౌరుడు ట్వీట్‌ చేశాడు. పౌరుడి ఫిర్యాదును నగర పోలీస్‌ కమిషనర్‌ ట్విటర్‌లో ట్రాఫిక్‌ విభాగానికి పంపారు. దీంతో పోలీస్‌ వాహనానికి మీర్‌ చౌక్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. రహదారికి అడ్డంగా పార్క్‌ చేసి నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆ వాహనానికి రూ.135లు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని