HYD మెట్రో: రెండోదశలో మూడు కొత్త మార్గాలు

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు...

Updated : 25 Feb 2020 19:12 IST

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్‌ మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. దీనికిగానూ డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రెండో దశలో రాయదుర్గం నుంచి ఆర్జీఐఏ (31 కి.మీ.), లక్డీకాపూల్ నుంచి ఆర్జీఐఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు నూతన మార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు. పాతబస్తీలో 5 కి.మీ. మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల మందికిపైగా మెట్రోలో ప్రయాణించారన్నారు. తిరుమల మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్రకటించారని.. మెట్రో ప్రాజెక్టు విషయంలో త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని