నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నాంపల్లి న్యాయస్థానంలో హాజరయ్యారు. 2010లో నిజామాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఎస్పీ...

Updated : 27 Feb 2020 16:05 IST

హైదరాబాద్‌: నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నాంపల్లి న్యాయస్థానంలో హాజరయ్యారు. 2010లో నిజామాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసినందుకు కవిత తోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ధర్నాకు దిగినందువల్ల పోలీసులు ఏ1గా కవితను చేర్చారు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని