అమరావతిలో హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు

అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు, రైతులు దిల్లీ పెద్దలను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తున్నారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌...

Updated : 03 Mar 2020 14:55 IST

దిల్లీ: అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు, రైతులు దిల్లీ పెద్దలను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తున్నారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ హెచ్‌.ఎల్‌.దత్తును కలిసి  అమరావతిలో రైతులు, మహిళలపై హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఎన్‌హెచ్‌ఆర్సీ వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్‌ .. త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు ఐకాస నేతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు సమయం కోరినట్లు తెలిపారు. అమరావతిలో 77 రోజులుగా నిరసనలు  జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని