పేలుళ్లకేసులో తీర్పు వెలువరించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌ పేలుళ్ల కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.  1998లో హుమయూన్‌ నగర్‌...

Published : 03 Mar 2020 22:20 IST

నాంపల్లి‌: హైదరాబాద్‌ పేలుళ్ల కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.  1998లో హుమయూన్‌ నగర్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పేలుళ్లకు టుండా కుట్ర పన్నాడనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ వరుస బాంబు పేలుళ్ల కేసులో టుండా పాత్ర ఉందని పోలీసులు భావించారు. కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించనందున టుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని