మీరైతే ఏం చేస్తారు?వైరల్‌ వీడియో...

ఎప్పుడైనా... జీవితంలో కనీసం ఒక్కసారైనా... ‘‘సింహం నా వైపు పరిగెత్తి వస్తే ఏం చేయాలి?’’ అని అనుకున్నారా?

Updated : 07 Aug 2020 10:15 IST

మాధవ్‌పూర్‌: ఎప్పుడైనా... జీవితంలో కనీసం ఒక్కసారైనా... ‘‘సింహం నా వైపు పరిగెత్తి వస్తే ఏం చేయాలి?’’ అని అనుకున్నారా? అబ్బే, అసలు నిజ జీవితంలో అలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా... మీరు మీ ఊర్లో, నడివీధిలో ఉన్నా కూడా ఇలా జరిగే అవకాశముంది. ఇది మా మాట కాదు... ఇందుకు నిదర్శనం అన్న వీడియో కూడా ఉంది! గుజరాత్‌లోని మాధవ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో ఏడు సెకెన్ల పాటు సాగుతుంది. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఓ అటవీ శాఖ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

దీనిలో ఓ మృగరాజు వీధివెంబడి వడివడిగా పరిగెత్తుకొస్తుండగా... అక్కడున్న ప్రజలు త్వరత్వరగా చెదిరిపోయి మరీ దానికి దారి ఇచ్చారు. మరికొందరైతే ఈ సంఘటనను తమ ఫోన్లలోని కెమేరాల్లో బంధించే పనిలో బిజీగా ఉండటం చూడవచ్చు. అయితే అక్కడ ఎంతోమంది మనుషులున్నా, సింహం ఎవరినీ చంపటానికి గానీ, గాయపర్చడానికి గానీ ప్రయత్నించలేదు. అదే విధంగా అక్కడ ఉన్నవారెవరూ ఆ మృగరాజును ఆపటానికి గానీ, బంధించటానికి గానీ సాహసించకపోవడం గమనార్హం. దీనిని గురించి ఆ అటవీశాఖ అధికారి ‘‘ఇంత సామరస్యాన్ని భారత్‌లో కాకుండా ఇంకెక్కడ చూడగలం?’’ అంటూ వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని