దోమకాటుతో కరోనా వ్యాపించదు

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఉన్న అపోహలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. దోమకాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. అలాగే వెల్లుల్లి తినడం, ఆల్కహాల్‌ సేవనంతో కరోనా రాకుండా అడ్డుకోలేమని పేర్కొంది.

Updated : 25 Mar 2020 23:05 IST

అల్కహాల్‌, వెల్లుల్లిలతో అడ్డుకోలేం
 కేంద్ర వైద్యఆరోగ్యశాఖ స్పష్టీకరణ

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఉన్న అపోహలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. దోమకాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. అలాగే వెల్లుల్లి తినడం, ఆల్కహాల్‌ సేవనంతో కరోనా రాకుండా అడ్డుకోలేమని పేర్కొంది. కేవలం కరోనా సోకిన వ్యక్తుల ద్వారా మాత్రమే ఇది వ్యాపించదని, వారితో ఉన్న వ్యక్తులకు కరోనా లక్షణాలు లేకపోయినా వైరస్‌ను వ్యాప్తి చేయగలుగుతారని తెలిపింది. అందువల్ల పాజిటివ్‌ ఉన్న వ్యక్తులతోపాటు, వారితో సన్నిహితంగా ఉన్నవారూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మాస్కులు అందరూ వాడాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. కేవలం జ్వరం, దగ్గు లక్షణాలు ఉన్నవారు, రోగాన పడ్డవారికి చికిత్స అందించే వైద్యసేవా సిబ్బంది, ఇంట్లో నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు దగ్గరగా ఉన్నవారు మాత్రమే వీటిని వాడాలని తెలిపింది. నిరోధించడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వెళ్లే ఆరోగ్య కార్యకర్తల సమాచారం కోసం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక కరపత్రాన్ని విడుదల చేసింది. అందులో వారు అనుసరించాల్సిన జాగ్రత్తలను సూచించింది.
* అనుమానిత వ్యక్తిని చూడడానికి వెళుతున్నపుడు లేదా వారితో కలిసి ఆసుపత్రికి వెళుతున్నప్పుడు.. ముక్కు, నోరు కప్పి ఉంచేలా మాస్కు ధరించాలి. మాస్కు లేకపోతే చేతి రుమాలు కట్టుకోవాలి.
* గర్భిణులు, నవజాత, అనారోగ్యం బారినపడిన పిల్లలు, తల్లిపాలు తాగుతున్న వారు, టీబీ, ఎన్‌సీడీ రోగులను గమనిస్తూ ఉండాలి. వారు తప్పకుండా ముందుజాగ్రత్తలు తీసుకునే సమయంలో తగిన సూచనలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని