గాయపడ్డ భార్యతో సైకిల్‌పై 12 కి.మీ..

కరోనా భయం మానవత్వాన్ని దూరం చేసింది.  పక్కన ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ..

Published : 28 Mar 2020 01:09 IST

లుథియానా(పంజాబ్‌) : కరోనా భయం మానవత్వాన్ని దూరం చేసింది.  పక్కన ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నా.. ఎవరూ పట్టించుకోని పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా పంజాబ్‌లో ఇదే ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు డ్రైవర్లు సైతం డబ్బులు అడుగుతున్నారని.. అంత డబ్బులు ఇవ్వలేక తానే సైకిల్‌పై 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు  ఓ వ్యక్తి  ఆవేదన వ్యక్తం చేశాడు.

వివరాల్లోకి వెళితే... పంజాబ్‌కు చెందిన  దేవదత్‌ రామ్‌ అనే వ్యక్తి భార్య  స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది. ఈనెల 20న రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా.. కంపెనీకి సంబంధిన వారే ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం తన భార్యను కంగ్వాల్‌లోని ఆస్పత్రికి తీసుకువచ్చేందుకు ఎవరినీ అభ్యర్థించినా..లాక్‌డౌన్‌ కారణంగా ముందుకు రాలేదు. అంబులెన్సు డ్రైవర్లను సంప్రదించగా.. వారంతా రూ. 2 వేలు ఇస్తేనే ఆస్పత్రికి  తీసుకెళ్తామన్నారని  దేవదత్‌ వాపోయారు.  దీంతో  సైకిల్‌పైనే తన భార్యను 12 కిలోమీటర్ల దూరంలోని కంగ్వాల్‌లోని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు దేవదత్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తనలాంటి వారిని ఆదుకోవాలని అధికారులను కోరుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని