రిక్షా కార్మికుడు..దానగుణంలో మేటి

కరోనా దేశాన్ని కుదిపేస్తుంది. దేశం మొత్తం  లాక్‌డౌన్‌తో బడుగుజీవుల బతుకులు దుర్భరమయ్యాయి. అయినాసరే ఈ ఆపద సమయంలో తాము

Published : 12 Apr 2020 17:55 IST

అగర్తలా: కరోనా దేశాన్ని కుదిపేస్తుంది. దేశం మొత్తం  లాక్‌డౌన్‌తో బడుగుజీవుల బతుకులు దుర్భరమయ్యాయి. అయినాసరే ఈ ఆపద సమయంలో తాము బతుకుతూ తోటివారికి చేతనైనంతా సహాయం చేస్తూ తమ దయాగుణం చాటుకుంటున్నారు కొందరు. అలాగే దాస్‌కూడా తాను కష్టపడి సంపాదించి మిగుల్చుకున్న రూ.10వేలలో రూ.8వేలను పేదప్రజల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే  త్రిపుర రాష్ట్రానికి  చెందిన గౌతమ్‌దాస్‌ ఒక రిక్షా తొక్కి జీవనం సాగిస్తాడు. భార్య కొంతకాలం క్రితమే మరణించింది. అప్పటి నుంచి తన గ్రామమైన సేదుతిల్లాలో  మట్టిగోడలతో కట్టిన ఇంటిలో ఒక్కడే ఉంటున్నాడు.  వస్తువులను చేరవేసే రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. కొవిడ్‌-19 మహమ్మారి కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో పేద ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడుతుండటం గమనించాడు. వెంటనే తాను దాచుకున్న రూ.10వేలలో రూ.8వేలు వెచ్చించి రోజూ అక్కడి పేదవారి ఆహారానికి అవసరమైన పప్పు, బియ్యం, కూరగాయలను సంచులలో నింపి తన రిక్షాతోనే ఇంటింటికి ఉచితంగా సరఫరా చేస్తున్నాడు. దీనిపై దాస్‌ స్పందిస్తూ..సాధారణ రోజుల్లో నేను రోజూ రిక్షా తొక్కి సగటున రూ.200 సంపాదించేవాడిని. అలా నేను రూ.10వేల వరకు కూడబెట్టగలిగాను. ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించడంతో గ్రామంలోని పేదవారు ఆహారానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నాకు చేతనైనంతా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇలా నిత్యవసరరాలను ఉచితంగా ఇస్తున్నాను’’ అని వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని