కొవిడ్‌-19: అంతా ఓకే అనుకునేంతలో మళ్లీ...

కరోనా వైరస్‌ వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్లీ పొడచూపటంతో... ఇద్దరు కొవిడ్‌ బాధితులు డిశ్చార్జి అయిన కొద్దిగంటల్లోనే మరోసారి ఆస్పత్రి పాలయ్యారు.

Published : 13 Apr 2020 18:33 IST

నొయిడా: కరోనా వైరస్‌ వ్యాధి తగ్గినట్టే తగ్గి మళ్లీ పొడచూపటంతో... ఇద్దరు కొవిడ్‌ బాధితులు డిశ్చార్జి అయిన కొద్దిగంటల్లోనే మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. దేశరాజధాని దిల్లీ సమీపంలోని నొయిడాలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలాఉన్నాయి. కరోనా సోకిన ఇద్దరు వ్యక్తులు నొయిడాలోని గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో చికిత్స పొందారు. వారు కోలుకున్న అనంతరం, నిబంధనల ప్రకారం వీరిద్దరికీ 24 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. రెండుసార్లు నెగటివ్‌ రావటంతో, వారిని శుక్రవారం డిశ్చార్జి చేశారు. ఆ సమయంలో వారినుంచి మరోసారి నమూనాలను తీసుకున్నారు. 

అనంతరం నమూనాలకు పరీక్షలు నిర్వహించగా, అందులో ఆ ఇద్దరు వ్యక్తులకు కొవిడ్‌-19 పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీనితో వారిద్దరినీ తిరిగి ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. ఈ సంఘటనపై వైద్యాధికారులు దర్యాప్తు చేస్తున్నారని... అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని అధికారులు తెలిపారు. నొయిడా ఉన్న గౌతమ్‌ బుధ్ద నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు 64 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా... 13 మంది చికిత్సానంతరం ఇళ్లకు వెళ్లినట్టు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని