వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసా..?

కరోనా మహమ్మారి దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పడు వచ్చే తుంపర్లతో ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ...

Published : 13 Apr 2020 23:07 IST

కరోనా మహమ్మారి దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పడు వచ్చే తుంపర్లతో ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. చాలా సులువుగా ఈ వైరస్‌ సోకే అవకాశం ఉండటంతో పరీక్షలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైద్యులు. అయితే కరోనా వైరస్‌ నిర్ధరణకు పరీక్షలు ఎలా చేస్తారు..? పరీక్షలు చేసే సమయంలో వైద్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? అనుమానిత వ్యక్తి నుంచి నమూనాలు ఎలా సేకరిస్తారో చాలా మందికి తెలియదు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్‌ సోకిన ఘటనలు దేశంలో ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుమానితుల నుంచి నమూనాల సేకరణకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు చేపట్టింది. దీనిలో భాగంగా నమూనా సేకరణ కేంద్రాల్లో గాజుతో కూడిన ప్రత్యేక గదులు ఏర్పాటు చేసింది. గదికి అవతల కూర్చున్న వ్యక్తి నుంచి వైద్యులు నమూనాలు సేకరిస్తారు. అనుమానిత వ్యక్తి కూర్చున్న ప్రదేశాన్ని పలుమార్లు శానిటైజ్‌ చేసిన తర్వాతే మరో వ్యక్తిని పరీక్షిస్తారు. ఇలా సేకరించిన నమూనాలను నిర్ధరణ కోసం ల్యాబ్‌లోకి పంపుతారు. 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని