కరోనా కష్టం... గుండెనీరయ్యే దృశ్యం...

లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అటువంటి ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Published : 15 Apr 2020 01:05 IST

ఆగ్రా: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్లిష్ట సమయంలో పేద ప్రజలు తమ కనీస అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. యూపీలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన ఫొటోలను చూస్తే పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందో అర్థమవుతోంది. రోడ్డు మీద ఒలికిన పాలను ఓ వ్యక్తి చిన్న మట్టి పాత్రలోకి ఎత్తుకుంటుండగా.. మరోవైపు ఆ ప్రక్కనే ఉన్న కొన్ని శునకాలు ఆ పాలను తాగుతున్నాయి.

ఆగ్రాలోని రాంబాగ్‌ చౌరాస్తాలో పాల కంటైనర్‌ బోల్తా పడింది. పాలన్నీ రహదారిపై ఒలికిపోయాయి. రోడ్డు మీద పడ్డ పాలను తీసుకునేందుకు ఆ వ్యక్తి చేసే ప్రయత్నం, ఆ పాలనే శునకాలు తాగుతుండటం చూసేవారి మనసులను కరిగిస్తోంది. కొవిడ్-19ను అదుపు చేసేందుకు లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని