పసరు మందుతో అసలుకే ఎసరు!

పాము కాటేసినా సకాలంలో వైద్యం చేయించక చెట్ల మందును ఆశ్రయించడంతో అసలుకే ఎసరొచ్చింది, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని మోవాడ్‌కు చెందిన గిరిజన యువతి మడావి నేతుబాయి (21)ని నెలన్నర

Updated : 26 Nov 2021 22:05 IST

పాముకాటుతో చెదలు పట్టినట్టుగా మారిన యువతి కాలు

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: పాము కాటేసినా సకాలంలో వైద్యం చేయించక చెట్ల మందును ఆశ్రయించడంతో అసలుకే ఎసరొచ్చింది, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని మోవాడ్‌కు చెందిన గిరిజన యువతి మడావి నేతుబాయి (21)ని నెలన్నర కిందట ఇంటి ఆవరణలో పాము కాటేసింది. ఆమెను తిర్యాణి మండలంలోని గంగాపూర్‌ గ్రామంలో ఉంటున్న మేనమామ ఇంటికి తీసుకెళ్లి.. చిన్న గుడిసె వేసి అందులో ఉంచారు. పసరు మందు పూశారు. చెట్ల మందు మాత్రమే తాగించారు. దాదాపు 50 రోజులు గడవడంతో కాలు పూర్తిగా విషపూరితమై చెదలు పట్టినట్టు మారింది. ఆమె మేనమామ స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించగా.. అతడు ఎస్‌ఐ రామారావుకు సమాచారమందించాడు. ఆమెను ఎస్‌ఐ వాహనంలో తిర్యాణి పీహెచ్‌సీకి ఆదివారం తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్య నిమిత్తం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మరో వాహనంలో ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని