సింగపూర్‌లో విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి విజృంభణతో సింగపూర్‌ విలవిల్లాడుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,624కు చేరుకున్నట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం సింగపూర్‌.. ఆసియాలో కరోనా ఇన్ఫెక్షన్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది....

Published : 26 Apr 2020 19:22 IST

ఆదివారం ఒక్కరోజే 931 పాజిటివ్‌ కేసులు

సింగపూర్‌ సిటీ: కరోనా మహమ్మారి విజృంభణతో సింగపూర్‌ విలవిల్లాడుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,624కు చేరుకున్నట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం సింగపూర్‌ ఆసియాలో కరోనా ఇన్ఫెక్షన్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. దాదాపు 50.7 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఎక్కువ శాతం కేసులు దక్షిణాసియా వాసులు నివాసముండే ప్రాంతాల్లోనే వెలుగుచూసినట్లు సమాచారం.

పెద్ద సంఖ్యలో బెడ్లు..

ఈ క్రమంలో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే స్థానికంగా లాక్‌డౌన్‌ విధించింది. వైరస్‌ సోకినవారికి వేగంగా చికిత్స అందించేలా పెద్ద సంఖ్యలో బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద ఏయిర్‌ షో నిర్వహణకు వేదికగా నిలిచే చాంగి ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో దాదాపు 4 వేల మందికి చికిత్స అందిస్తోంది. ఆసియాలో కేసులపరంగా చూసుకుంటే సింగపూర్‌.. చైనా, భారత్, జపాన్‌, పాకిస్తాన్‌ తర్వాతి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని