టీకా ఉత్పత్తికి చేతులు కలిపిన ఐఐటీ-గువాహటి, హెస్టెర్‌ బయోసైన్సెస్‌

 కరోనా మహమ్మారిని నిలువరించగల టీకాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఐఐటీ-గువాహటి, అహ్మదాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెస్టెర్‌ బయోసైన్సెస్‌ చేతులు కలిపాయి.

Published : 29 Apr 2020 23:57 IST

దిల్లీ: కరోనా మహమ్మారిని నిలువరించగల టీకాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఐఐటీ-గువాహటి, అహ్మదాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెస్టెర్‌ బయోసైన్సెస్‌ చేతులు కలిపాయి. ఈ నెల 15న వాటి మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. రికాంబినంట్‌ ఏవియన్‌ పారామిక్సోవైరస్‌ సంబంధిత సాంకేతికత ఆధారంగా టీకాను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో సార్స్‌-కొవ్‌-2 ఇమ్యూనోజెనిక్‌ ప్రొటీన్‌ వ్యక్తీకరణకు రికాంబినంట్‌ ఏవియన్‌ పారామిక్సోవైరస్‌-1ను ఉపయోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని