
Published : 05 May 2020 22:59 IST
ఇతను మద్యం ఎంత కొన్నాడో తెలుసా?
బెంగళూర్ : మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కంటైన్‌మెంట్ జోన్ వెలుపలి ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులుదీరారు. బెంగళూరులోని చిక్‌అడిగోడి ప్రాంతంలోని మద్యం దుకాణంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.52,841 విలువగల మద్యాన్ని ఓకేసారి కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొత్తం 17 రకాల బ్రాండ్‌లు కొనుగోలు చేసినట్టు చూపిస్తున్న బిల్లు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఓ వ్యక్తికి 2.25 లీటర్ల వైన్, ఆరు బీర్ బాటిళ్లను విక్రయించేందుకు అనుమతి ఉన్నా.. సదరు వ్యక్తి మాత్రం భారీ మొత్తంలో కొనుగోలు చేశాడు. కర్ణాటకలో సోమవారం ఒక్క రోజే రూ. 45 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Tags :