జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీ ఖరారు

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన జేఈఈ అడ్వాన్స్‌ 2020 పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ఒక ప్రకటన చేశారు....

Updated : 08 May 2020 08:37 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2020 పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ఒక ప్రకటన చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మే 17న ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడింది. జులై 18-23 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ మరోసారి పొడిగిచడటం, వైరస్‌ తీవ్రత తగ్గకపోవడం వంటి కారణాలతో పరీక్షలను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడు నిర్వహించనున్నదీ వెల్లడించలేదు. తాజా ప్రకటనతో పరీక్షల తేదీపై ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని