మదర్స్‌ డే: ముంబయి పోలీస్‌ల ఎమోషనల్‌ వీడియో

తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి, పురిటి నొప్పులను కూడా పంటి బిగువన భరించి బిడ్డకు జన్మనిస్తుంది. తన బిడ్డల బాగు కోసం త్యాగాలు చేసే తల్లులు ఎంద

Updated : 10 May 2020 19:17 IST

ముంబయి: తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి, పురిటి నొప్పులను కూడా పంటి బిగువన భరించి బిడ్డకు జన్మనిస్తుంది. తన బిడ్డల బాగు కోసం త్యాగాలు చేసే తల్లులు ఎందరో ఈ భూ ప్రపంచంలో ఉన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఇలా ఎందరో కరోనా నియంత్రణకు కృషి చేస్తూ కరోనాపై జరిగే ఈ యుద్ధంలో ముందు వరుసలో నిలబడ్డారు.

తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా  మదర్స్‌ డే ప్రతిబింబించేలా ముంబయి పోలీసులు పంచుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా ఉంది. ‘కరోనాపై యుద్ధంలో ముందు వరుసలో నిలబడి పోరాటం చేస్తున్న యోధులకు ముందున్న యోధులు ఎవరు’ అంటూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. ‘అందరికంటే ధైర్యవంతులు ఎవరు’ ఇంకెవరు? కరోనాపై పోరాటం చేస్తున్న యోధుల తల్లులు అంటూ సాగే వీడియో భావోద్వేగాన్ని కలిగిస్తోంది.

 

 Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని