శ్రీకాకుళం చేరుకున్న శ్రామిక్‌ రైలు

తమిళనాడు నుంచి 889 మంది వలస కార్మికులతో శ్రామిక్‌ రైలు మంగళవారం ఉదయం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన...

Updated : 12 May 2020 12:18 IST

శ్రీకాకుళం: తమిళనాడు నుంచి 889 మంది వలస కార్మికులతో శ్రామిక్‌ రైలు మంగళవారం ఉదయం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన వారిలో 635 మంది మత్స్య కారులు ఉన్నారు. వీరంతా పది నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి చెన్నై వలస వెళ్లారు. 17 బోగీల్లో శ్రీకాకుళం చేరుకున్న కూలీలకు భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ సాల్మన్‌రాజు స్వాగతం పలికారరు. వీరందరినీ సరుబుజ్జిలి వెన్నెల వలస నవోదయ, శ్రీకాకుళం డెంటల్‌ కాలేజ్‌, చిలకపాలెం శివానిలో ఏర్పాటు చేసిన నాలుగు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇందులో 35 మందిని రెండు బస్సుల్లో విజయనగరం తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని