మైక్రోమ్యాక్స్‌లో అత్యాధునిక వెంటిలేటర్ల తయారీ

కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీవర్క్స్‌ రూపొందించిన అత్యాధునిక, తక్కువ ధర గల వెంటిలేటర్లను భారీ ఎత్తున...

Updated : 13 May 2020 08:31 IST

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీవర్క్స్‌ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీవర్క్స్‌ రూపొందించిన అత్యాధునిక, తక్కువ ధర గల వెంటిలేటర్లను భారీ ఎత్తున తయారీకి మైక్రోమ్యాక్స్‌ (భగవతి ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌) సంస్థతో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో త్వరలోనే మైక్రోమ్యాక్స్‌ వీటి ఉత్పత్తిని చేపడుతుంది. హైదరాబాద్‌కు చెందిన క్వార్కమ్‌, హనీవెల్‌, స్పెక్టోక్రెమ్‌, ఇన్‌స్ట్రమెంట్స్‌, ఎంటెస్లా, ఆల్థియాన్‌, త్రిశూల, కన్సర్‌విజన్‌ వంటి అంకుర సంస్థల సహకారంతో టీవర్క్స్‌ దీనిని రూపొందించింది. పరీక్షల నిర్వహణ అనంతరం చికిత్సకు అనుకూలమైనదిగా ధ్రువీకరణ పత్రం లభించింది. టీవర్క్స్‌ సీఈవో సుజయ్‌ కారంపూరి మాట్లాడుతూ త్వరలో అత్యుత్తమ వెంటిలేటర్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మైక్రోమ్యాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాజేశ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గొప్ప అవకాశమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని