చిలుకూరు అటవీ ప్రాంతానికి చిరుత

కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై హల్‌చల్‌ చేసి కనిపించకుండా పోయిన చిరుత కాటేదాన్‌ నుంచి చిలుకూరు అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చిరుత జాడ

Published : 16 May 2020 02:02 IST

హైదరాబాద్‌ : కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై హల్‌చల్‌ చేసి కనిపించకుండా పోయిన చిరుత కాటేదాన్‌ నుంచి చిలుకూరు అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చిరుత జాడ తెలుసుకొనేందుకు ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. చిరుతను బంధించడం కోసం వ్యవసాయ పొలంలో ఆహారాన్ని ఎరగా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.  అయితే చిరుత మరోసారి ఇదే ప్రాంతానికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేసిన బోన్‌లు అలాగే ఉంచాలని నిర్ణయించారు. చిలుకూరు పరిసర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని