శాసించే స్థాయికి రైతులు ఎదగాలి:నిరంజన్‌ రెడ్డి

వర్షాకాలంలో కంది, పత్తిపంటలు ఎక్కువగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న పంటను అసలే వేయొద్దని రైతులకు సూచించారు. పంటల సాగుపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో

Published : 19 May 2020 23:57 IST

హైదరాబాద్: వర్షాకాలంలో కంది, పత్తిపంటలు ఎక్కువగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న పంటను అసలే వేయొద్దని రైతులకు సూచించారు. పంటల సాగుపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పంటవేయటం దగ్గర నుంచి అమ్ముకునే వరకు ప్రభుత్వ సూచనలు పాటించి ఆశించిన స్థాయి నుంచి శాసించే స్థాయికి రైతు ఎదగాలన్నారు. రేపు ఉదయం 10గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమగ్ర వ్యవసాయ విధానంపై సమావేశం ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశాలకు రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులు రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారులు, నిపుణులు హాజరవుతారని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి అన్న అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే, జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం.. ఎక్కడ, ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను రూపొందించననున్నారు. ఆ పంట మ్యాప్‌పై 21న జరగనున్న సమావేశంలో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించి ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని