రైలులో బిడ్డను ప్రసవించిన వలసకూలీ

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది.  దీంతో పనుల్లేక  ఆర్థిక ఇబ్బందులతో ...

Published : 20 May 2020 14:32 IST

పట్నా : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వలసకార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ నుంచి బిహార్‌లోని సీతామర్హికి  శ్రామిక్‌ రైలులో వెళ్తున్న వలసకూలీల్లో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికులు తోడ్పాటునందించడంతో ఆ మహిళ రైల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారమందుకున్న రైల్వే అధికారులు వెంటనే వైద్యులను పంపి దనాపూర్‌ రైల్వేస్టేషన్‌లో తల్లీబిడ్డలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తల్లీ బిడ్డా.. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా.. సోమవారం బిహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. త్రిపుర రాష్ట్రం అగర్తల నుంచి బిహార్‌కు శ్రామిక్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆడశిశువుకు జన్మినిచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 31 తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని