2 గంటల్లో 1.5 లక్షల టికెట్లు ఉఫ్‌..!

సుమారు రెండు నెలల తర్వాత రైల్వే సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలు ప్రయాణానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. జూన్‌ 1 నుంచి నడవబోయే రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ను ఇవాళ ప్రారంభించడంతో రైలు టికెట్లు......

Published : 21 May 2020 15:24 IST

దిల్లీ: సుమారు రెండు నెలల తర్వాత రైల్వే సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలు ప్రయాణానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. జూన్‌ 1 నుంచి నడవబోయే రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ను ఇవాళ ప్రారంభించడంతో రైలు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. బుకింగ్‌ ప్రారంభించిన రెండు గంటల్లోనే 1.50 లక్షల టికెట్లు విక్రయించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

మొత్తం 100 జతల రైళ్లకు గానూ (200 రైళ్లు) మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 73 రైళ్లకు మాత్రమే టికెట్లు మిగిలాయని రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 2,90,510 మంది ప్రయాణికులకు గానూ 1,49,025 టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. కేటాయించిన టికెట్లు పూర్తయిన తర్వాత 200వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లకు అవకాశం కల్పిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు
రోజూ నడిచే రైళ్లు: ముంబయి-హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02701/02), హావ్‌డా- సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (02703/04), హైదరాబాద్‌- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (02723/24), దానాపూర్‌- సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02791/92), విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (02805/06), గుంటూరు- సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (07201/02) , తిరుపతి- నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (02793/94), హైదరాబాద్‌- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (02727/28).

దురంతో రైళ్లు: సికింద్రాబాద్‌- హజ్రత్‌ నిజాముద్దీన్‌ (02285/86) (వారానికి రెండుసార్లు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని