తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల...

Updated : 23 May 2020 17:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కరోనా వ్యాప్తికి ముందు ప్రకటించిన తేదీలను రీషెడ్యూల్‌ చేసిన ఉన్నత విద్యామండలి తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. జులై 1న పాలిసెట్‌, జులై 4న ఈసెట్‌, జులై 13న ఐసెట్, జులై 15న ఎడ్‌సెట్‌, జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌, జులై 10న లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ పరీక్షలు జరగనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం సూచించిన అన్ని నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని