కొండపోచమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం తీగుల్‌ నర్సాపూర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులు..

Updated : 24 Sep 2022 15:22 IST

గజ్వేల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం తీగుల్‌ నర్సాపూర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులు.. కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పర్యటనలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 కొండపోచమ్మ జలాశయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ఎత్తయిన ప్రాంతం ఇదే. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. మేడిగడ్డ నుంచి వచ్చే జలాలు దాదాపు అర కిలోమీటరు (518 మీటర్లు) మేర పైకి వచ్చి కొండపోచమ్మ జలాశయంలోకి చేరనున్నాయి. ఈ జలాశయం ద్వారా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. త్రిదండి చినజీయర్‌ స్వామితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ జలాశయాన్ని ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని