మన దగ్గర ఆరోగ్య సేతు.. ఇతర దేశాల్లో?
బ్యాంకింగ్ సేవల నుంచి వంటలు రెసిపీ వరకు అన్నీ ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోతున్నాయి. ఎలాంటి సేవలైనా యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి.. వస్తున్నాయి. ఇలా మనిషి జీవితంలో భాగమైన ఈ యాప్‌లు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడిలోనూ తమ
బ్యాంకింగ్ సేవల నుంచి వివిధ వంటల తయారీ వరకు అన్నీ ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోతున్నాయి. ఎలాంటి సేవలైనా యాప్ రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా మనిషి జీవితంలో భాగమైన ఈ యాప్‌లు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడిలోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో కరోనా రోగులను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ను ఏప్రిల్‌లో తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ ఈ యాప్‌ను తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఈ యాప్‌ను 10 కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఆరోగ్య సేతు వంటి కరోనాకు సంబంధించి పలు యాప్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కరోనా రోగుల ట్రాకింగ్, కరోనా సెల్ఫ్ అసిస్ట్, కరోనా అప్‌డేట్స్ వంటి బేసిక్ ఫీచర్లతోపాటు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఆ యాప్‌లను మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గానీ.. ఆ యాప్‌లేవి? ఎలా పనిచేస్తాయో ఓ సారి లుక్కేయండి..
కొవిడ్ సేఫ్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కొవిడ్ సేఫ్ యాప్ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత ఈ యాప్ వాడుతున్న వ్యక్తుల్ని కలిసినప్పుడు ఆ వివరాలు ఇందులో నిక్షిప్తమవుతాయి. అనంతరం యూజర్లలో ఎవరికి కరోనా సోకినా.. మిగతా వారికి సమాచారం అందడంతోపాటు.. ఆ వివరాలు ఆరోగ్యశాఖ అధికారులకు తెలిసిపోతుంది. తద్వారా వారిని ఆస్పత్రికి తరలించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారు.
స్టాప్ కరోనా (ఆస్ట్రియా)
బ్లూటూత్, గూగుల్/యాపిల్ ఐడీ లాగిన్‌తో పనిచేసే ఈ యాప్ యూజర్ కలిసే ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తుంది. యూజర్‌కి కరోనా సోకినట్లు తేలితే.. 48 గంటలలోపు వారు ఎవరెవరిని కలిశారో వారందరికి కరోనా సోకిన విషయం యాప్ ద్వారా తెలిసిపోతుంది.
బీ అవేర్ ( బహ్రెయిన్)
బ్లూటూత్, లోకేషన్ డాటాతో పనిచేసే ఈ యాప్ కరోనా రోగులను ట్రాక్ చేయడంతోపాటు క్వారంటైన్‌లో ఉన్నవారి కదలికలను కూడా గమనిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వెళ్తే ఈ యాప్ అధికారులను అలర్ట్ చేస్తుంది.
వైరుసేఫ్ (బల్గేరియా)
జీపీఎస్ లోకేషన్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. కరోనా రోగుల్ని ట్రాక్ చేయడంతోపాటు.. సమీపంలో ఎవరైనా కరోనా సోకినవారు ఉంటే అలర్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు యూజర్‌కు కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో అడిగి పరిశీలిస్తుంది.
చైనా హెల్త్‌కోడ్ సిస్టమ్ ( చైనా)
ఆ దేశంలో ఎలాంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయో స్పష్టమైన వివరాలు తెలియదు. కానీ హెల్త్‌కోడ్ సిస్టమ్‌లో మూడు రంగులను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. కరోనా రోగులు, వారిని కలిసిన వ్యక్తులకు ఎరుపు రంగు.. వ్యాధి సోకే అవకాశాలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉండే వారికి పసుపు రంగు, కరోనా లేని ప్రాంతాల్లోని వారికి గ్రీన్ రంగు క్యూఆర్ కోడ్‌లను కేటాయిస్తున్నట్లు సమాచారం.
ఇ రౌస్కా (చెక్ రిపబ్లిక్)
ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. యూజర్ కలిసిన వ్యక్తుల్లో ఎవరికైనా కొన్ని రోజుల తర్వాత కరోనా పాజిటివ్ అని తేలితే.. యాప్‌ను పర్యవేక్షిస్తున్న హైజెనిక్ స్టేషన్ నుంచి అధికారులు ఫోన్ చేసి మరి వివరాలు తెలియజేస్తారు. కరోనా సోకిన వ్యక్తిని గత కొన్ని రోజుల్లో ఎవరెవరిని కలిశారో వివరాలు సేకరిస్తారు.
కోవ్‌యాప్ (జర్మనీ)
ఈ యాప్‌ను సైంటిఫిక్ రీసెర్చ్‌లో భాగంగా రూపొందించారు. ఈ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత యూజర్ రోజు వారీ ఆరోగ్య పరిస్థితిని ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. దాన్ని బట్టి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో ఈ యాప్ చెబుతోంది. (సెల్ఫ్ అసిస్ట్ మాదిరిగానే) కాకపోతే ఇందులో యూజరే స్వయంగా రాయాల్సి ఉంటుంది.ఈ యాప్ యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు.
రాక్‌నింగ్ సీ-19 (ఐస్‌లాండ్)
ఈ యాప్ లోకేషన్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా యూజర్ జీపీఎస్ లొకేషన్ వివరాలు ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ యూజర్ కరోనా బారిన పడితే.. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అధికారులు లోకేషన్ డేటాను యూజర్ అనుమతితో తీసుకొని యూజర్‌ను కలిసిన వారిని గుర్తించే పనిలో పడతారట.
హమాగెన్ (ఇజ్రాయెల్)
ఈ యాప్ జీపీఎస్ లొకేషన్ ఆధారంగానే పనిచేస్తుంది. కరోనా రోగులు ఉన్న ప్రాంతాలు హమాగెన్ యాప్‌లో రూట్ మ్యాప్‌లా కనిపిస్తాయి. ఈ యాప్ యూజర్ పరిసరాల్లో ఎవరికైనా కరోనా ఉంటే అలర్ట్ చేస్తుంది. అయితే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సమాచారం మాత్రమే ఇందులో ఉంటుంది. కాబట్టి ఇది కచ్చితత్వంతో పనిచేస్తుందన్న నమ్మకం లేదని ఆ దేశ అధికారులే చెబుతున్నారు.
ఇమ్యూనీ (ఇటలీ)
కరోనా నేపథ్యంలో ఇటలీలో ఏర్పాటు చేసిన ఎక్స్‌ట్రార్డినరీ కమిషనర్ ఫర్ కొవిడ్-19 ఎమర్జెన్సీ.. ఆరోగ్యశాఖతో కలిసి ఈ ఇమ్యూనీ యాప్‌ను రూపొందించింది. బ్లూటూత్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ యాప్‌నకు ఓ ప్రత్యేకత ఉంది. యూజర్‌కు చెందిన జీపీఎస్ లోకేషన్‌తోపాటు వ్యక్తిగత వివరాలు ఏవీ ఇమ్యూనీ సేకరించదు. కేవలం కరోనా సోకిన యూజర్ ఇంకా ఎవరిని కలిశారు.. ఎక్కడ కలిశారు అన్న రెండు విషయాలను మాత్రమే గుర్తిస్తుందట.
కొవిడ్ రాడర్ (మెక్సికో)
బ్లూటూత్ ఆధారంగానే పనిచేసే ఈ యాప్‌ను కరోనా కేసులు తగ్గించడమే లక్ష్యంగా రూపొందించారు. కొవిడ్ రాడర్ యూజర్‌కు కరోనా సోకినట్లయితే 14 రోజుల వ్యవధిలో అతడు కలిసిన వారందరికి(ఈ యాప్ యూజర్లు) హెచ్చరికలు అందుతాయి. కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారికే మాత్రమే కాదు.. యూజర్ వెళ్లిన సూపర్ మార్కెట్లో, ఫార్మసీ దుకాణాల వద్ద ఆ రోజుల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈ సమాచారం తెలిసిపోతుంది. దీంతో వెంటనే వారు కరోనా పరీక్షలు చేసుకోని, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఎన్.జెడ్ కొవిడ్ ట్రేసర్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ రూపొందించిన ఈ యాప్.. యూజర్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నాడన్న సమాచారాన్ని(వెళ్లిన చోట ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు) సేకరిస్తుంది. ఈ యాప్ ద్వారానే ఆ దేశ కరోనా సంబంధిత సేవల కోసం ఫోన్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు. తద్వారా యూజర్ సమీపంలో కరోనా సోకిన వారు ఉంటే అధికారులు అలర్ట్ చేస్తారు. ఈ యాప్‌లో నిక్షిప్తమైన యూజర్ వ్యక్తిగత వివరాలు 31 రోజులకు ఆటోమెటిక్‌గా డిలిట్ అయిపోతాయి.
ట్రేస్ టుగెదర్ (సింగపూర్)
కరోనా వ్యాప్తి కట్టడి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక యాపే ట్రేస్ టుగెదర్. బ్లూటూత్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ యూజర్, కరోనా సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లివచ్చినా.. ఆ తర్వాత వారికి కరోనా సోకినా ట్రేస్ టుగెదర్ యాప్ సహాయంతో దేశ ఆరోగ్యశాఖ అధికారులే యూజర్‌కి ఫోన్ చేస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు.
హయత్ ఈవ్ సిగర్ (టర్కీ)
హయత్ ఈవ్ సిగర్.. టర్కీ ప్రభుత్వం రూపొందించిన యాప్. ఇందులో లాగిన్ అయ్యే సమయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇచ్చిన సమాధానాలను బట్టి యాప్ కొన్ని జాగ్రత్తలు సూచిస్తుంది. అంతేకాదు యూజర్‌కి వారి సమీపంలోని ఆస్పత్రులు, ఫార్మసీలు, మార్కెట్ల లొకేషన్లను యాప్‌లో చూపిస్తుంది. అలాగే కుటుంబసభ్యులు, బంధువులు ఉండే ప్రాంతాల్లో కరోనా పరిస్థితి ఎలా ఉందో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ట్రేస్ కొవిడ్ (యూఏఈ)
ఈ యాప్ యూజర్ల ‘సెక్యూర్ ట్రేసింగ్ ఐడెంటిఫయర్(ఎస్‌టీఐ)’ను ఎన్‌క్రిప్టెడ్ రూపంలో సేకరించి.. ఎక్స్ఛేంజ్ చేసి యూజర్ల మొబైల్‌లోనే నిక్షిప్తం చేస్తుంది. ఉదాహరణకు ట్రేస్ కొవిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు సూపర్ మార్కెట్‌కి వెళ్తే.. ఒకరి ఎస్‌టీఐని మరొకరికి ఎక్స్ఛేంజ్ చేస్తుందన్నమాట. ఈ యాప్ యూజర్లలో ఎవరికైనా కరోనా సోకితే.. వారి మొబైల్‌లో ఉన్న ఎన్‌క్రిప్టెడ్ ఎస్‌టీఐను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా అధికారులు కోరతారు. ఆ తర్వాత కరోనా సోకిన వ్యక్తిని కలిసిన వారిని, వెళ్లిన ప్రాంతాలను అలర్ట్ చేస్తారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటారు.
కొవిడ్ కోయా (ఫిలిప్పిన్స్)
ఫిలిప్పిన్స్ ఆరోగ్యశాఖ తీసుకొచ్చిన ఈ కొవిడ్ కోయా యాప్ దేశంలోని కరోనా కేసుల వివరాలు తెలియజేస్తుంది. ఈ యాప్ ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ కోసం రూపొందించారు. కరోనా కేసుల వివరాల నమోదు, కరోనా పరీక్షల ఫలితాల వెల్లడి, రోగుల వివరాలు పొందుపర్చడం.. తదితర సేవలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఇలాంటివే మరికొన్ని యాప్‌లు
కొవి-ఐడీ (ఆఫ్రికా) |
అమన్ (జోర్డాన్)
|
కరోనా ట్రేసర్ - బీడీ (బంగ్లాదేశ్) |
మై ట్రేస్ (మలేషియా) |
కరోనా యాప్ (కొలంబియా) |
కొవిడ్-19 సర్వెవలెన్స్ (నేపాల్) |
కెట్జు (ఫిన్‌లాండ్) |
కేర్ 19 (నార్త్ డకోటా - యూఎస్) |
స్టాప్ కరోనా (ఫ్రాన్స్) |
స్మిట్టేస్టాప్ (నార్వే) |
జీహెచ్ కొవిడ్-19 ట్రాకర్ (ఘనా) |
కొవిడ్ 19 (పాకిస్థాన్) |
వైరస్ రాడర్ (హంగేరీ) |
ఇతెరాజ్ (ఖతర్) |
పెడులిలిండుంగి (ఇండోనేషియా) |
మై హెల్త్ (శ్రీలంక) |
మాస్క్ (ఇరాన్) |
ఎన్‌హెచ్‌ఎస్ కొవిడ్-19 (యూకె) |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి
-
Movies News
Rana-Naga Chaitanya: ‘మాయాబజార్’ వెబ్‌సిరీస్ కోసం రానా-నాగచైతన్య!
-
Sports News
IND vs AUS: మూడో వన్డేలో ఆసీస్‌దే గెలుపు.. సిరీస్ కైవసం
-
General News
Vijayawada: న్యాయవాదిపై కేసు.. భవానీపురం సీఐను వీఆర్‌కు పంపిన సీపీ
-
India News
QR Code: సమాధిపై QR కోడ్.. కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!