కిటకిటలాడిన రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌  

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కేందుకు వందల సంఖ్యలో ప్రయాణికులు తరలివచ్చారు. దీంతో రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. గతంలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌

Published : 05 Jun 2020 13:00 IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కేందుకు వందల సంఖ్యలో ప్రయాణికులు తరలివచ్చారు. దీంతో రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. గతంలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి స్టేషన్లలో ఆగేది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాజమహేంద్రవరం స్టేషన్‌లో మాత్రమే ఆగేందుకు అధికారులు అనుమతిచ్చారు. అలాగే... పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు, తాడేపల్లిగూడెం స్టేషన్లలోనూ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు స్టాప్‌ను తాత్కాలికంగా రద్దు చేయడంతో ఉభయగోదావరి జిల్లాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ కోసం రెండు జిల్లాలకు చెందిన వారు రాజమహేంద్రవరం స్టేషన్‌కు తరలి వచ్చారు. 

ఇదే సమయంలో ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్లే కోణార్స్‌ ఎక్క్‌ప్రెస్‌ అక్కడికి రావడంతో అందులోని ప్రయాణికులకు అధికారులు థర్మల్‌ స్కానింగ్‌ చేశారు. అనంతరం వారి వస్తువులను సైతం పూర్తిగా శానిటైజ్‌ చేశారు. వారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని