బాలింతకు కరోనా..క్వారంటైన్‌కు వైద్యులు

గుంటూరు సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి, మత్తు వైద్య విభాగాల్లో పనిచేస్తున్న 8మంది వైద్యులు, ఇద్దరు నర్సులు, నాలుగో తరగతి సిబ్బందిని హోం క్వారంటైన్‌కు

Published : 11 Jun 2020 10:45 IST

గుంటూరు(వైద్యవిభాగం): గుంటూరు సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి, మత్తు వైద్య విభాగాల్లో పనిచేస్తున్న 8మంది వైద్యులు, ఇద్దరు నర్సులు, నాలుగో తరగతి సిబ్బందిని హోం క్వారంటైన్‌కు తరలించారు. గుంటూరు నగరానికి చెందిన గర్భిణి ఈనెల 7న సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చింది. ప్రసవం సమయం దగ్గర పడటంతో వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ప్రసవానంతరం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. 

అయితే, అప్పటికే కరోనా వ్యాధి నిర్ధారణ కోసం ఆమె నమూనాలు సేకరించారనే విషయం ఆస్పత్రిలోని వైద్యులకు తెలియదు. 9వ తేదీ వచ్చిన నివేదికలో ఆమెకు పాజిటివ్‌ అని తేలింది. విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులకు, ప్రసవం కోసం ఆమె ఆస్పత్రిలో చేరిందని  తెలిసింది. దీంతో ఆస్పత్రిలోని వైద్యులకు విషయం తెలియజేశారు. ఆమెను హుటాహుటిన ఐసోలేషన్‌కు తరలించారు. నవజాత శిశువు నమూనాను కరోనా నిర్ధారణ పరీక్షకు పంపించాలని నిర్ణయించారు. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, సిబ్బంది వారం రోజుల పాటు ఇంటి వద్దే స్వీయనిర్భందంలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని