తెలంగాణకు ఐదు రోజులపాటు వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుదనం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని

Published : 16 Jun 2020 16:03 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుదనం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కొమరంభీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరిత ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా జూన్‌ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని