అడవిని సృష్టించి అద్భుతం చేశారు

సారం లేని భూమిలో రెండేళ్లలో అడవిని సృష్టించి అటవి శాఖ అద్భుతం చేసిందని అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పురపాలిక పరిధి లక్కారం అటవీ క్షేత్రంలో రూ.3.45కోట్లతో ఏర్పాటు చేసిన తంగేడు వనాన్ని మంత్రి

Published : 26 Jun 2020 00:14 IST

టీఎస్‌ అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

చౌటుప్పల్‌ (యాదాద్రి భువనగరి): సారం లేని భూమిలో రెండేళ్లలో అడవిని సృష్టించి అటవి శాఖ అద్భుతం చేసిందని అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పురపాలిక పరిధి లక్కారం అటవీ క్షేత్రంలో రూ.3.45కోట్లతో ఏర్పాటు చేసిన తంగేడు వనాన్ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కలసి ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడ  ఏర్పాటు చేసిన యాదాద్రి మోడల్ ఫారెస్ట్‌ను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. 

ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... ఎకరం విస్తీర్ణంలో నాలుగు వేల మొక్కలను నాటి రెండేళ్లలోనే చిట్టడవిని సృష్టించారని అభినందించారు. కాకుల దూరని కారడవిగా ఉన్న ఈ యాదాద్రి మోడల్ ఫారెస్టు రాష్ట్రానికే ఆదర్శమన్నారు. హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత ఐదు విడతల్లో 185 కోట్ల మొక్కలను నాటామన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి చెప్పారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్, అటవీ శాఖ పీసీపీఎఫ్‌ శోభ, సీసీఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎఫ్‌వో వెంకటేశ్వరరెడ్డి, ఎఫ్ఆర్వోలు సర్వేశ్వర్, శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని