వెలిగల్లు ప్రాజెక్టుకు వైఎస్‌ఆర్‌ పేరు

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ పేరుతో ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం

Published : 27 Jun 2020 02:22 IST

ఏపీ ప్రభుత్వం నిర్ణయం

అమరావతి: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ పేరుతో ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వంద శాతం ప్రభుత్వ నిధులతో ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు చేసింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో రిజిస్టర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీవీకి తొలుత జలవనరుల శాఖ నుంచి రూ.5 కోట్ల పెట్టుబడి మంజూరుకు ఆదేశించింది. ఈ సంస్థ ద్వారా రూ.40 వేల కోట్లను ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కడప జిల్లాలోని వెలిగల్లు పేరును వైఎస్‌ఆర్‌ వెలిగల్లు రిజర్వాయర్‌గా ప్రభుత్వం మార్పు చేసింది. ఇక నుంచి వైఎస్‌ఆర్‌ వెలిగల్లు ప్రాజెక్టుగా వ్యవహరించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని