కరోనా ఉందని తెలిసీ.. జేబీఎస్‌లో బస్సెక్కి..

కరోనా మహమ్మారి విజృంభణ వేళ భయంతో జనం వణికిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే ....

Published : 05 Jul 2020 03:57 IST

ఆదిలాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభణ వేళ భయంతో జనం వణికిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతుంటే ముగ్గురు వ్యక్తులు మాత్రం తమకు కరోనా సోకిందని తెలిసీ ఆర్టీసీ బస్సెక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ముగ్గురూ నిన్న మధ్యాహ్నం 3.30గంటలకు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి ఆదిలాబాద్‌కు పయనమయ్యారు. సూపర్‌ లగ్జరీ బస్సు (TS08Z 0229)లో ప్రయాణించారు. నిన్న రాత్రి 10.30 గంటలకు బస్సు ఆదిలాబాద్‌ చేరుకుంది. దీంతో వారు బస్సు దిగి నేరుగా ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. తమకు కరోనా సోకిందని చెప్పి ఆస్పత్రిలో చేర్చుకోవాలని వైద్యులను కోరారు. కరోనా లక్షణాలతో ఇటీవల నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బాధితులు.. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ముగ్గురికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది బస్సులో ప్రయాణించిన వారు కరోనా పరీక్షలకు రావాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని