ఒకే గొడుగు కిందకి నీటిపారుదల శాఖ: కేసీఆర్‌

 సాగునీటి సౌకర్యం కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

Updated : 12 Jul 2020 22:33 IST

హైదరాబాద్‌:  సాగునీటి సౌకర్యం కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటివరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.  నీటిపారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. 

‘‘ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. వీలైనంత ఎక్కువ మంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.  ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు, తర్వాత రిజర్వాయర్లు నింపాలి, చివరికి ఆయకట్టుకు అందించాలి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు  వీలైనంత ఎక్కువ ఓటీలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలి ’’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని