Marriage Registration: వరుడు, వధువు ఎదురుగా లేకున్నా..

వధూవరులు భౌతికంగా ఎదురుగా ఉండాలని పట్టుబట్టాల్సిన అవసరం లేకుండానే ప్రత్యేక వివాహ

Updated : 08 Sep 2021 04:58 IST

పెళ్లి నమోదు చేయవచ్చు

కోచి: వధూవరులు భౌతికంగా ఎదురుగా ఉండాలని పట్టుబట్టాల్సిన అవసరం లేకుండానే ప్రత్యేక వివాహ చట్టం (ఎస్‌ఎంఏ) కింద వివాహాలను నమోదు చేయవచ్చని కేరళ హైకోర్టు సోమవారం తెలిపింది. వివాహాల నమోదు అధికారి రెండు పక్షాలను గుర్తించడం సవాలుతో కూడుకున్న అంశమని, ఇందుకోసం ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్, బయోమెట్రిక్స్‌ సాంకేతిక పరిజ్ఞానం వంటివి ఉపయోగించడం ఒక ఐచ్ఛికమని అభిప్రాయపడింది. ఇటువంటి వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు న్యాయస్థానానికి అంత నైపుణ్యం లేదని జస్టిస్‌ ఎ.మహమద్‌ ముస్తాక్, జస్టిస్‌ కౌసర్‌ ఎడప్పాగథ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని