AC jacket‌: జవాను చల్లగుండ.. సైనికుల కోసం ఏసీ జాకెట్‌

దేశ రక్షణ కోసం మండుటెండల్లో విధులు నిర్వర్తించే సైనికుల చల్లదనం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఏసీ జాకెట్‌ను రూపొందించారు. రాజస్థాన్‌ ఎడారుల్లాంటి సుమారు 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుందని

Updated : 15 Dec 2021 08:11 IST

మైసూరు: దేశ రక్షణ కోసం మండుటెండల్లో విధులు నిర్వర్తించే సైనికుల చల్లదనం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఏసీ జాకెట్‌ను రూపొందించారు. రాజస్థాన్‌ ఎడారుల్లాంటి సుమారు 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు. దీన్ని యుద్ధ ట్యాంకులు, జలాంతర్గాముల్లోనూ వాడొచ్చని చెప్పారు. విదేశాల్లో దాదాపు రూ.25లక్షల ఖరీదు ఉండే ఈ జాకెట్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో కేవలం రూ.1.5 లక్షల వ్యయంతోనే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంలో ఇదో కీలక అడుగు అని పేర్కొన్నారు. మైసూరులో మంగళవారం నిర్వహించిన డీఆర్డీవో ఉత్పత్తుల ప్రదర్శనలో ఈ జాకెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాస్త్రవేత్త రేవయ్య ఈటీవీ భారత్‌కు దీని పనితీరును వివరించారు. జాకెట్‌లోని ఓ చిన్న ఉపకరణం ద్వారా చల్లటి నీరు ప్రవహిస్తుందని, శరీర ఉష్ణోగ్రతను సంగ్రహించి వాతావరణంలోకి వదులుతుందని చెప్పారు. ఈ జాకెట్‌తో శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని