TS News: విజయ పాల ధర పెంపు..నేటి నుంచే అమలు

 విజయ పాల ధర లీటరుపై రూ.2, హోల్‌ మిల్క్‌పై రూ.4 చొప్పున పెరిగింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్‌ మేనేజర్‌ వి.మల్లికార్జునరావు

Updated : 01 Jan 2022 07:10 IST

లీటరుపై రూ.2.. హోల్‌ మిల్క్‌పై రూ.4 పెంపు

ఈనాడు, హైదరాబాద్‌- లాలాపేట న్యూస్‌టుడే:  విజయ పాల ధర లీటరుపై రూ.2, హోల్‌ మిల్క్‌పై రూ.4 చొప్పున పెరిగింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్‌ మేనేజర్‌ వి.మల్లికార్జునరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

పెరిగిన ధరలు ఇలా..

* డబుల్‌ టోన్డ్‌ పాల రకం 200 మిల్లీలీటర్ల(మి.లీ.) ప్యాకెట్‌ ధర రూ.9 ఉండగా రూ.9.50కి పెంచారు. 300 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.14 నుంచి రూ.15కు చేరింది. 500 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.22 నుంచి రూ.23కి పెరిగింది.

* ఆవుపాలు 500 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.24 నుంచి రూ.25కు, టోన్డ్‌ పాలు 500 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.10 నుంచి రూ.10.50కు, 500 మి.లీ. ధర రూ.24 నుంచి రూ.25కు, లీటరు ధర రూ.47 నుంచి రూ.49కి, ఆరు లీటర్ల ధర రూ.276 నుంచి రూ.288కి చేరింది.

* స్టాండర్‌డైజ్డ్‌ పాలు 500 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.26 నుంచి రూ.27కి పెరిగింది. హోల్‌ మిల్క్‌ 500 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.31 నుంచి రూ.33, డైట్‌ పాలు 500 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.21 నుంచి రూ.22కు పెరిగింది.

* టీ స్పెషల్‌ 500 మి.లీ. ప్యాకెట్‌ ధర రూ.23 నుంచి రూ.24కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని