Viveka murder case : వివేకా హత్య కేసులో తులసమ్మ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

Updated : 27 Mar 2023 13:26 IST

దిల్లీ : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ.. ఈ హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌ వేశారు. తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై గత సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. దర్యాప్తు పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. దీంతో దర్యాప్తు పురోగతి, పూర్వాపరాల విషయాలపై నివేదిక దాఖలు చేసినట్లు సమాచారం. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు.

విచారణ సందర్భంగా.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సోమవారం వాదనల సందర్భంలో.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని కోర్టు సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగింది. విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని