పరిమిత ప్రీమియం చెల్లింపుతో..

పొదుపుతో పాటు, జీవిత బీమా రక్షణ కూడా ఉండేలా ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్త పాలసీని మార్కెట్లోకి విడుదల చేసింది.

Updated : 09 Dec 2022 13:18 IST

పొదుపుతో పాటు, జీవిత బీమా రక్షణ కూడా ఉండేలా ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్త పాలసీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిపేరు ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్‌కం అడ్వాంటేజ్‌ ప్లాన్‌. జీవితంలోని వివిధ దశల్లో ఉండే అవసరాలను బట్టి పెట్టుబడిని తిరిగి ఇచ్చే విధంగా ఈ పాలసీని రూపొందించారు. పాలసీ వ్యవధిలో మొదటి అర్ధ భాగంలో మాత్రమే ప్రీమియం చెల్లించాలి. రెండో అర్ధ భాగంలో క్రమం తప్పకుండా హామీతో కూడిన వార్షిక ఆదాయాన్ని పాలసీ ఇస్తుంది. బోనస్‌లు అదనం. 16, 24, 30 ఏళ్ల వ్యవధులతో ఇది లభిస్తోంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌, యాక్సిడెంటల్‌ డెత్‌, డిజేబిలిటీ రైడర్లను జోడించుకునే వెసులుబాటు ఉంది. జీవిత బీమా మొత్తాన్ని పెంచుకోవాలనుకుంటే టర్మ్‌ రైడర్‌ కూడా ఉంది. 16 ఏళ్ల వ్యవధి పాలసీకి కనీస వయసు 9ఏళ్లు, 24 ఏళ్ల వ్యవధి పాలసీకి 5ఏళ్లు, 30ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే 2ఏళ్ల కనీస వయసు ఉంటే చాలు. 24ఏళ్ల వ్యవధికి పాలసీని ఎంచుకుంటే కనీస ప్రీమియం రూ.18,000. నెలనెలా చెల్లించాలనుకుంటే రూ.1,635. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని