GHMC: మల్కారం చెరువు శుద్ధికి జీహెచ్‌ఎంసీ చర్యలు.. రూ.251 కోట్లతో పనులకు శ్రీకారం

వందలాది ఎకరాల పంట పొలాలు, పది గ్రామాల భూగర్భ జలాలను విషతుల్యం చేసిన మల్కారం చెరువు శుద్ధికి జీహెచ్‌ఎంసీ శ్రీ కారం చుట్టింది.

Published : 16 Dec 2021 20:14 IST

హైదరాబాద్‌: వందలాది ఎకరాల పంట పొలాలు, పది గ్రామాల భూగర్భ జలాలను విషతుల్యం చేసిన మల్కారం చెరువు శుద్ధికి జీహెచ్‌ఎంసీ శ్రీ కారం చుట్టింది. రూ.251 కోట్లతో గాఢ మురుగు జలాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేసే కాంట్రాక్టును రాంకీ ఎన్విరో సంస్థ దక్కించుకుంది. ప్రయోగాత్మకంగా చెరువు వద్ద నెలకొల్పిన చిన్నపాటి ప్లాంటు విజయవంతమైందన్న నిర్వాహకులు.. ఫిబ్రవరి నాటికి పెద్ద యంత్రాలను నిర్మించి పూర్తిస్థాయిలో ప్లాంటును నడిపిస్తామని తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఆనుకుని ఉండటం, నిత్యం సుమారు 6,500 టన్నుల వ్యర్థాల కారణంగా మల్కారం చెరువు విషతుల్యంగా మారుతోంది. ఎట్టకేలకు ఈ చెరువును శుద్ధిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని