Godavari: ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Published : 10 Aug 2022 11:25 IST

రాజమహేంద్రవరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 12.10 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తి డెల్టా కాలువలకు 6వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 10.27లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని